రాజ్యసభలో ఆమోదించిన వ్యవసాయ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని ఖమ్మం జిల్లా సీపీఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు విమర్శించారు. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలకు తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం సుందరయ్య భవన్లో సీపీఐ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులతో కలిసి సమావేశం నిర్వహించారు.
!['వ్యవసాయ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8893889_df.png)
ఈనెల 25న కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించే బంద్కు సహకరించాలని కోరారు. తెరాస రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో తెరాస శ్రేణులు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్