ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఖమ్మం నగరంలో మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్లో సీపీఐ జిల్లా నిర్మాణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి చాడ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమం చేసిన పార్టీ అయి ఉండి ప్రజాస్వామ్యయుతంగా పాలించడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం జరిగిన పోరాటం ఇప్పుడు నెరవేరలేదు చాడ అన్నారు. నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు.
భవిష్యత్తులో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా సీపీఐ ఉంటుందన్నారు. ప్రజల సమస్యల పైన పోరాడుతున్న సీపీఐ రాష్ట్రంలో త్వరలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. సభలో సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!