ETV Bharat / state

బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం: డి.రాజా - హైదరాబాద్ చేరుకున్న దిల్లీ సీఎం కేజ్రీవాల్

బీజేపీని ఓడించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగసభలో పాల్గొన్న ఆయన.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారత్‌.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆరోపించారు.

BRS meeting
BRS meeting
author img

By

Published : Jan 18, 2023, 5:34 PM IST

తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. తెలంగాణలో సుపరిపాలన అందుతోందని వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు ఆదర్శమని వెల్లడించారు.

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మరిన్ని మంచి పథకాలు తేవాలి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడింది. భారత్‌.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోంది. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోంది. మోదీ.. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్నారు. భాజపా గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. - డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దులు మీరుతున్నారని డి.రాజా ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని అన్నారు. బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమన్నారు. భాజపా.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలిపారు.

బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం: డి.రాజా

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.