'ప్రజా గొంతుకగా ఉండేవారే కమ్యూనిస్టులు' - 2019 telangana elections
సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. చాలా ఏళ్ల తర్వాత సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇది చారిత్రక అవసరమని ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు అభిప్రాయపడ్డారు.
ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సభ
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ, సీపీఎంలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఖమ్మం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ మారకుండా, ప్రజలు ఇచ్చిన ఓటుకి విలువనిచ్చే తమ పార్టీ అభ్యర్థి వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
CPi cpm parlament sannahaka sama vesham chada byte