పత్తి కొనుగోలు చేయాలంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పత్తి ఈనామ్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకి దిగారు. ఉదయం పత్తి మార్కెట్లో వ్యాపారులు పత్తి కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. జిన్నింగ్ మిల్లుల వ్యాపారుల బంద్ కారణంగానే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపారు. ఆగ్రహించిన అన్నదాతలు వామపక్షాలతో ఆందోళన చేశారు. వెంటనే వ్యాపారులు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ ఛైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేశారు. వ్యాపారులతో చర్చలు జరిపి పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. ఛైర్మన్ చొరవతో తిరిగి కొనుగోల్లు ప్రారంభమయ్యాయి.
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు