గణనీయంగా పడిపోయిన ఆదాయం
ఖమ్మం రీజియన్‌లో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోలున్నాయి. వాటి పరిధిలోని ప్రయాణ ప్రాంగణాల్లో 366 దుకాణాలు ఉన్నాయి. ఖమ్మం ప్రాంగణంలో కొన్నింటికి నెలకు రూ.80 వేలకు పైగా అద్దెలున్నాయి. దీంతో రీజియన్ వ్యాప్తంగా నెలకు అద్దెల రూపంలో సుమారు రూ.20లక్షల ఆదాయం వచ్చేది. కొవిడ్ కారణంగా చాలా దుకాణాలు తెరవడం లేదు. తెరిచిన వారు వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ఎక్కువగా తినుబండారాలు విక్రయించేవే ఉన్నాయి. ప్రయాణికులు బయట తిండిపై ఆసక్తి చూపడం లేదు. దీంతో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి.
కొందరు తాము టెండర్‌లో వేసిన పదార్థాలకు బదులుగా ప్రస్తుతం మార్కెట్ ఉన్న శానిటైజర్లు తదితరాలను విక్రయిస్తున్నారు. కొందరు అద్దెలు చెల్లించలేక ఖాళీ చేస్తున్నారు. గత నెలరోజులుగా 10 దుకాణాలు కరోనా కారణంగా ఖాళీ అయినట్లు సమాచారం. వాటిలో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
ఖమ్మం రీజియన్ పరిధిలో
- డిపోలు: 6
- బస్‌స్టేషన్లలో దుకాణాలు: 366
- ప్రస్తుతం ఖాళీగా ఉన్నవి: 110
- ప్రతి నెలా దుకాణాల ఆదాయం: రూ.20లక్షలు
- ప్రస్తుతం వస్తున్న ఆదాయం: రూ.10,47,192
ఖాళీ దుకాణాలకు టెండర్లు పిలిచాం
కొవిడ్ నేపథ్యంలో దుకాణాలు తక్కువ సంఖ్యలోనే ఖాళీ అయ్యాయి. వాటితో పాటు గతం నుంచి ఖాళీగా ఉన్న వాటికి టెండర్లు పిలిచాం. త్వరలోనే టెండర్లు తెరిచి దుకాణాలు కేటాయిస్తాం.
-కృష్ణమూర్తి, ఆర్టీసీ ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్
ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'