ETV Bharat / state

'అమ్మో వైరస్ వస్తోంది... అక్కడ స్వచ్ఛందంగా లాక్​డౌన్' - వ్యాపార సముదాయాలపై కరోనా ప్రభావం

చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది కరోనా. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా... అన్ని రంగాలపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. లాక్​డౌన్ తర్వాత తెరుచుకుని... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపార, వాణిజ్య సముదాయాలు... వేగంగా విస్తరిస్తున్న కరోనా ప్రభావంతో మళ్లీ డీలాపడుతున్నాయి. దీంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు.

corona-effect-in-shops-at-khammam-district
'అమ్మో వైరస్ వస్తోంది... అక్కడ స్వచ్ఛందంగా లాక్​డౌన్'
author img

By

Published : Jul 20, 2020, 11:22 AM IST

కరోనా ప్రభావం క్రమంగా విస్తరించడం, పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోవటంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతుందోనన్న ఆందోళనలో... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను ప్రకటించుకున్నాయి.

ఖమ్మం జిల్లా కేంద్రంలో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోనే అత్యధికంగా ఖమ్మం నగరంలోనే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలన్ని భయాందోళనకు గురిచేస్తోంది.

ఇద్దరు వ్యాపారులు మృతి...

ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న గాంధీ చౌక్​లో ఇద్దరు వ్యాపారులు కరోనాతో మృతి చెందండంతో అక్కడ వ్యాపారాలు కలవరానికి గురయ్యారు. ఈ పరిణామంతో కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ కు సిద్ధమయ్యారు.

కొన్ని రోజులపాటు వస్త్ర దుకాణాలన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే నడపాలని వస్త్ర వ్యాపారుల సంఘం తీర్మానించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం సాగించాలని బంగారం, వెండి వ్యాపారులు నిర్ణయించారు. కిరాణా దుకాణాలు సైతం సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.

గగనమవుతోంది..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లోనూ వ్యాపార, వాణిజ్య సముదాయాల పనివేళలను ఒకపూటకే తగ్గించారు. వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు ప్రాంతాల్లోనూ సాయంత్రం వరకే వ్యాపారాలు సాగించాలని నిర్ణయించారు. భద్రాచలంలో నిత్యం దాదాపు 10 కోట్ల వ్యాపారాలు సాగేవి. ఇప్పుడు 6 కోట్ల మేర జరగడమే గగనమవుతోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు..

ప్రభుత్వ కార్యాలయన్నీ కోవిడ్ ధాటికి విలవిల్లాడుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల కరోనా నియంత్రణ చర్యలు చేపట్టి... సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జడ్పీ కార్యాలయంలో 2 పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై... రోజుకు 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.

కలెక్టరేట్​లో ముందస్తు చర్యగా వీడియోల ద్వారా సమస్యలు పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య 25కు చేరింది. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది బిక్కు బిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. కరోనా ప్రభావంతో వ్యవసాయ మార్కెట్​లో క్రయ, విక్రయాలు జరపలేమని చాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్కెట్​లో కొనుగోళ్లు నిలిపివేయాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికార యంత్రాంగం మరిన్ని చర్యలు తీసుకుంటేనే కరోనా విజృంభణకు అడ్డుకట్టపడుతుంది. లేకుంటే పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యను ఆపడం కష్టమే మరి.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.