ETV Bharat / state

ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు సలాం: వీహెచ్​ - congress rally at khammam

మోదీ పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. కలెక్టరేట్​ ఎదుట భైఠాయించిన ఆపార్టీ సీనియర్​ నేత వీహెచ్​.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు సలాం: వీహెచ్​
author img

By

Published : Nov 8, 2019, 6:39 PM IST

ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు సలాం: వీహెచ్​

ప్రధాని మోదీ అసంబద్ధ నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంలో భారీ నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనతో కలెక్టర్​ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం వల్ల గేటు బయటే భైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. ఆర్టీసీ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టన్న వీహెచ్​.. న్యాయస్థానానికి సలాం చేస్తున్నానన్నారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్​, పెద్ద ఎత్తున కాంగ్రెస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆర్టీసీ ఐకాస నేత రాజిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.