ETV Bharat / state

రాజీనామాకు డిమాండ్

సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని హస్తం నేతలు విమర్శించారు. పార్టీ మారిన నేతలు రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు.

నిరసన ర్యాలీ
author img

By

Published : Mar 5, 2019, 3:14 PM IST

కాంగ్రెస్​ నేతల నిరసన
పార్టీ మారే నేతలు ఎమ్మెల్యే పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్​ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్​ వరకు ప్రదర్శన జరిగింది. శాసనసభ్యులను కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ హస్తం నాయకులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంబేడ్కర్​ విగ్రహానికి నివాళి

ఖమ్మం జడ్పీ కూడలి వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్​ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

ఇవీ చూడండి :'ప్రియుడి కోసం టవరెక్కింది'

కాంగ్రెస్​ నేతల నిరసన
పార్టీ మారే నేతలు ఎమ్మెల్యే పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్​ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్​ వరకు ప్రదర్శన జరిగింది. శాసనసభ్యులను కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ హస్తం నాయకులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంబేడ్కర్​ విగ్రహానికి నివాళి

ఖమ్మం జడ్పీ కూడలి వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్​ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

ఇవీ చూడండి :'ప్రియుడి కోసం టవరెక్కింది'

Intro:filename:

tg_adb_01_05_atavi_samraskhanalo_shunakam_pkg_c11


Body:()జాగిలం పేరు వింటే చాలు నేరస్తులని పట్టడంలో వాటి నైపుణ్యం గుర్తుకొస్తుంది. వాటి చర్యల్ని ప్రత్యక్షంగా చూడకున్నా... వార్తలలో... సినిమాల్లోనూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ఈమధ్య మనుషులకే కాదు అడవులకు సేవలు అందిస్తున్నాయి. వాటిలో చీతా అనే జాగిలం ముందుంది.
ఇప్పటి వరకు ఒక్క పోలీస్ శాఖ వారు మాత్రమే జాగిలం సేవలను వినియోగించుకోవడం మనం చూసాం. కానీ ఇకముందు అటవీ శాఖవారు కూడా వినియోగించుకోనున్నారు. సంక్లిష్టమైన నెరపరిశోధనలో ముఖ్యపాత్ర పోషించే జాగిలం సేవలను అటవీశాఖలో ప్రవేశపెట్టి మెరుగైన ఫలితాలు సాధించారు మన అధికారులు.

VO....01
అటవీ శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ఎక్కడో ఒకచోట అడవి జంతువుల వేట, కలప అక్రమ రవాణా చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించుకోవలనే ఉద్యేశంతో అటవీ శాఖ అధికారులు జాగిలం సేవలను వినియోగించుకోవాలని నిశ్చ్యయించుకున్నారు.


VO...02
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఉన్న బిఎసెఫ్ డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రంలో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీట్ ఆఫీసర్లు తొమ్మిది నెలలు శిక్షణ పొందారు. వారితో పాటు శిక్షణ తీసుకున్న ఆరు నెలల వయసున్న జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కపిల్ల చీతా ఇప్పుడు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటుంది.

మొత్తం ఐదు దశల్లో ఈ చీతా కు శిక్షణనిచ్చారు.
జంతువులను వేటాడినా, కలప స్మగ్లింగ్ చేసిన వాసనతో పసిగట్టడం...
భూమిలోపల దాచిన వస్తువులను వెలికితీయడం...
మత్తుపదార్థాల లాంటివి తరలింపును పసిగట్టడం...
పెద్ద పెద్ద భవనాలలో దాచిన వాటిని పట్టుకోవడం...
వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న వాటిని గుర్తించే నైపుణ్యం వీటి సొంతం...


VO...03
ఇటీవల చోటు చేసుకున్న పలు అటవీ నేరాల్లో ఈ చీతా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వేటగాళ్ళు జంతువులను చంపిన అనంతరం మాంసాన్ని ఓ కొట్టంలో దాచి ఉంచడంతో వాసనతో పసిగట్టి నేరగాళ్లను పట్టించింది.
పెంబి అటవీ ప్రాంతంలో పులిని వేటాడి చంపిన ఘటనలోను సహకరించింది. స్మగ్లర్లు పంటపొలాల్లో దాచిన కలపను సైతం పట్టి ఇచ్చింది.

అటవీ సంరక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ జాగిలం సేవలను వినియోగించుకోనున్నట్లు కాగజ్ నగర్ ఎఫ్డిఓ రాజా రమణ రెడ్డి తెలిపారు



బైట్స్:
01) కాగజ్ నగర్ ఎఫ్డిఓ: రాజా రమణ రెడ్డి
02) డాగ్ స్క్వాడ్ హాండ్లర్: సత్యనారాయణ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.