ETV Bharat / state

ఖమ్మంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం - కాంగ్రెస్​ తాజా వార్తలు

ఖమ్మం నగరపాలక సంస్థ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాయకత్వం... శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు విస్తృతస్థాయి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణికం ఠాగూర్, ఉత్తమ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, 33 జిల్లాలు, పట్టణ, నగరాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.

congress meeting on corporation and mlc elections in khammam
కార్పొరేషన్​, ఎమ్మెల్సీ ఎన్నికలపై​ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం
author img

By

Published : Feb 7, 2021, 12:04 PM IST

ఖమ్మంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణికం ఠాగూర్, ఉత్తమ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, 33 జిల్లాలు, పట్టణ, నగరాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం నగరపోరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈ ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.

పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ ప్రచార కార్యాచరణపైనా మణికం ఠాగూర్‌ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు కాంగ్రెస్ 6 చోట్ల గెలుపొందగా... తర్వాత పరిణామాలతో క్షేత్రస్థాయిలో శ్రేణుల్లో నిర్లిప్తత కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పునర్వైభవం సాధించి... రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.