ETV Bharat / state

వ్రతానికి రండి మెుక్కలు తీసుకెళ్లండి - HYBISCUS FLOWERS

ఆయనో ఉద్యానశాఖ అధికారి. మొక్కల పెంపకంపై మక్కువ. చెట్ల విలువ తెలిసినవాడిగా తోటివారిలోనూ చైతన్యం కలిగించాలనుకున్నాడు. శుభకార్యానికి వచ్చిన అతిథులకు మొక్కలు బహుమతిగా ఇచ్చాడు.

మెుక్కల పంపిణీ నిర్ణయం తీసుకున్నట్లు వరుడు నవీన్​కుమార్ తెలిపారు
author img

By

Published : Mar 3, 2019, 7:47 AM IST

సత్యనారాయణ వ్రతానికి హాజరైన అతిథులందరికీ ప్రసాదంతోపాటు మందార మొక్కలు ఇచ్చారు
ఖమ్మం యూపీహెచ్‌ కాలనీలో ఓ ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అతిథులందరికీ దేవుడి ప్రసాదంతోపాటు మందార మొక్కలు ఇచ్చారు. వినూత్నంగా ఇచ్చిన బహుమతులను బంధుమిత్రులు ఇష్టంగా తీసుకెళ్లారు.

అతిథులకు మెుక్కల పంపిణీ...
ఖమ్మం నగరానికి చెందిన జంపాల గురువయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమళ్ల పాడు నర్సరీలో ఏఈవోగా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న తన కుమారుడు నవీన్ కుమార్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించాడు. వచ్చిన అతిథులకు నూతన వధూవరులతో మొక్కలను బహుమతులుగా ఇప్పించాడు. పర్యావరణంపై ప్రేమతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని వచ్చిన వారందరూ కొనియాడారు.
తన తండ్రి ఆలోచన మేరకే మెుక్కల పంపిణీ నిర్ణయం తీసుకున్నట్లు వరుడు నవీన్​కుమార్ స్పష్టం చేశారు. శుభకార్యాన్ని వేదికగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న గురువయ్య కృషి ఉన్నతమైందని సహ ఉద్యోగులు ప్రశంసించారు.వేడుకనే వేదికగా తీసుకొని చెట్ల ఆవశ్యకతను తెలుపుతున్న ఆ కుటుంబాన్ని అందరూ అభినందిస్తున్నారు

ఇవీ చూడండి :విద్యార్థిగా కొప్పుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.