ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన కూడళ్ల నుంచి ర్యాలీ చేశారు. మానవహారంగా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు.
ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"