పురపాలక అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు. వైరా పురపాలక కార్యాలయంలో నిర్వహించిన 2021-22 బడ్జెట్ ముఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన వైరా పురపాలికను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. పాలకమండలి సభ్యులు, అధికారులు సమష్టిగా ముందుకు సాగాలన్నారు. ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవాలని, పన్నుల వసూలులో కీలకంగా ఉండాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు.
కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సూతకాని జైపాల్, వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు, అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, కమిషనర్ వెంకటస్వామి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయండి: ఎంపీ కోమటిరెడ్డి