ETV Bharat / state

ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన భట్టి సైకిల్ యాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్‌ యాత్ర మూడో రోజు ఖమ్మం జిల్లాకు చేరింది. ఇంధన ధరల పెంపునకు నిరసనగా భట్టి విక్రమార్క సైకిల్‌ యాత్ర చేపట్టారు. భద్రాచలం నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క సైకిల్‌ యాత్ర నిర్వహించనున్నారు.

Bhatti cycle ride into Khammam district
Bhatti cycle ride into Khammam district
author img

By

Published : Mar 9, 2021, 3:07 PM IST

ఇంధన ధరలను విపరీతంగా పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై ఎన్నడూ లేని విధంగా భారం మోపుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అంతకంతకూ పెరుగుతున్న ధరలకు నిరసనగా... భద్రాచలం నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర మూడో రోజు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది.

BATTI
సైకిల్ యాత్రలో చిన్నారితో మాట్లాడుతున్న భట్టి

హిమామ్‌నగర్‌ సమీపంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ సహా పార్టీ నేతలు భట్టి చేపట్టిన సైకిల్‌ యాత్రకు స్వాగతం పలికారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయని అన్నారు. కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత భారం మోపుతున్నాయని విమర్శించారు. ఈనెల 12తో ముగియనున్న భట్టి చేపట్టిన సైకిల్‌ యాత్ర ముగియనుంది.

ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన భట్టి సైకిల్ యాత్ర

ఇదీ చూడండి: హైటెన్షన్ కేబుల్​ పోల్​ను ఢీకొట్టిన టిప్పర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.