గోదావరిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల గురించి వాస్తవాలు చెప్పాలనే జలదీక్ష చేపట్టినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ-2ను ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. ఈ స్టేజ్-2 ను పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని తెలిపారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తే 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే సుమారు 33.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని అన్నారు. రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని తెలిపారు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ఇష్టానుసారంగా అంచనాలు పెంచారని భట్టి మండిపడ్డారు.