ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం... పురిట్లోనే శిశువు మృతి - child death

వైద్యుల నిర్లక్ష్యంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఓ శిశువు మృతి చెందింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా పర్యటనలో ఉన్న జాతీయ బాలల హక్కుల కమిటీ సభ్యుడు ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించారు.

వైద్యుల నిర్లక్ష్యం... పురిట్లోనే శిశువు మృతి
author img

By

Published : Aug 24, 2019, 1:07 PM IST

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. సాక్షాత్తు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది. కారేపల్లికి చెందిన కవిత మూడు రోజుల క్రితం కాన్పు కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. నొప్పులు రాకపోయినా... వైద్యులు నార్మల్​ డెలివరీ చేయడం వల్ల శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శిశువు మృతదేహంతో జిల్లా పరిషత్​ క్యార్యాలయానికి చేరుకొని... వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని జాతీయ కమిటీ సభ్యుడు ఆనంద్​కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై గమగ్ర విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఆయన ఆదేశించారు.

వైద్యుల నిర్లక్ష్యం... పురిట్లోనే శిశువు మృతి

ఇదీ చూడండి:''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

Intro:tg_kmm_09_23_shishuvu_mruthi_ab_ts10044

( )

ఖమ్మం జిల్లాలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు తిరుగుతున్న వేళ.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కాన్పు సమయంలో తమ శిశువు మృతి చెందింది అంటూ కొంతమంది మహిళలు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో బాలల సమస్యలపై ఉన్నత అధికారులతో సమావేశం జరుగుతుండగా మహిళలు ఆయనకు ఫిర్యాదు చేశారు. కారేపల్లి కి చెందిన కవిత మూడు రోజుల క్రితం కాన్పు కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. నొప్పులు రాకపోయినా నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఎదురుచూశారు. ఈరోజు బలవంతంగా నార్మల్ డెలివరీ చేయగా శిశువు మృతి చెందింది. కాన్పు సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్ల తమ శిశువు మృతి చెందిందని శిశువు బంధువులు ఆరోపించారు. జడ్పీ సమావేశ మందిరానికి శిశువు మృతదేహంతో రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కమిషన్ సభ్యుడు బయటకు వచ్చి సంఘటనపై విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు....byte
byte.. మృతి చెందిన శిశువు అమ్మమ్మ

Body:శిశువు మృతి

Conclusion:శిశువు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.