తెల్లవారు జామున చెత్త ఏరుకుంటున్నట్లు నటిస్తూ సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న దొంగను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని నాలుగు పోలీసు ఠాణాల పరిధిలో దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఏసీపీ వెంకట్రావు తెలిపారు. నాగేల్లి వరకుమార్ అనే నిందితుడు గత కొంత కాలంగా సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తున్నాడు. అతని నుంచి రూ.3లక్షల విలువైన చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సీపీ ఆదేశాల మేరకు పీడి యాక్టు నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: చంచల్‌గూడలో ఈఎస్‌ఐ నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నం