ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలో జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి.. సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన మంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 7 లక్షల 22 వేల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 193 గ్రాముల బంగారం, 406 గ్రాముల వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లు ఉన్నట్టు వైరా ఏసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. నిందితుడు ఖమ్మం జిల్లాతోపాటు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఒకే రోజు నలుగురు అదృశ్యం