భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్‌లోని ఖాతాల్లో కొంతకాలంగా నగదు మాయమైతున్నాయి. గతంలోనూ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరిగాయి. భద్రాచలంలోని రంగనాయకుల గుట్టకు చెందిన రామావజుల లక్ష్మీ ఖాతా నుంచి మూడు దఫాలుగా లక్షా పదివేలు పోయినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులతో పాటు మెయిన్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు.
గతంలో.. దమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన అచ్చన్న... బంగారు తాడు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. నగదు చెల్లించి తిరిగి తాడు తీసుకునే సమయంలో... అది లేదు. బ్యాంకు సిబ్బందిని అచ్చన్న నిలదీయగా... ఆభరణం చేయించి ఇచ్చేందుకు మేనేజర్ హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇలా ఎందుకు జరుగుతుందోనని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీచూడండి: 'కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించారు'