ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. అత్తాకోడళ్ల మృతి

తమ కుటుంబంలోకి బుజ్జిబాబు వస్తున్నాడని సంతోషపడ్డారు. డాక్టర్​ వద్దకు వెళ్లారు. ఇంకో నెల రోజుల్లో పండంటి బిడ్డ పుడుతుందని వైద్యురాలు చెప్పింది. నెల రోజులు ఎప్పుడూ గడస్తాయా అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు. వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. అత్త, కోడలితోపాటు కడుపులో ఉన్న పసిపాపను కాలువ మృత్యువు రూపంలో మింగింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా గొల్లగూడెం సాగర్ కాలువ వద్ద జరిగింది.

కాలువలోంచి కారు బయటకు తీస్తున్న స్థానికులు
author img

By

Published : Sep 23, 2019, 12:37 AM IST

తీరని విషాదం.. మిగిలిన దుఃఖం

ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద ఓ కారు సాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లింది. కారు రివర్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నిండు గర్భిణితోపాటు మరో మహిళ మృతి చెందారు. గర్భిణి మృతి చెందినప్పటికీ ఆమె కడుపులోని బిడ్డ మాత్రం బతికున్నాడనే విషయం తెలుసుకుని వైద్యులు హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు.

ఆస్పత్రికి వచ్చి అనంతలోకాలకు...

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చిన్నగూడూరు గ్రామానికి చెందిన పోగుల మహిపాల్‌ రెడ్డి భార్య స్వాతి (28) తొమ్మిది నెలల గర్భిణి. ఈ క్రమంలో మహిపాల్‌ రెడ్డి తన తల్లి ఇందిర (48), భార్యను తీసుకొని ఆదివారం ఉదయం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. తిరుగు ప్రయాణంలో గొల్లగూడెం వద్ద కారును రివర్స్‌ చేస్తున్న సమయంలో కారు అదుపుతప్పి సాగర్‌ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన మహిపాల్‌ రెడ్డి కారులో నుంచి బయటికి దూకేయడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న అత్తాకోడళ్లు ఇందిర, స్వాతి బయటకురాలేక నీటిలో మునిగిపోయి చనిపోయారు.

ఆపరేషన్ చేసినప్పటికీ...

పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వాతి కడుపులో శిశువు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్‌ చేసి బాబును బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే బాబు మృతిచెందాడు. ఒకేసారి అత్త, కోడలు మృతి చెందటం వల్ల మరిపెడ బంగ్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించటం పలువురిని కంటతడి పెట్టించింది.

ఇదీచూడండి: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..

Intro:సాగర్ కాలవలో కారు బోల్తా ఇద్దరు మహిళలు మృతి

Body:పరకాలలో కారు బోల్తా ఇద్దరు మహిళలు మృతి

Conclusion:సాగర్ కాలవలో కారు బోల్తా ఇద్దరు మహిళలు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.