ETV Bharat / state

పొంగులేటి అనుచరులపై బీఆర్​ఎస్​ బహిష్కరణ వేటు

pongulati srinivasreddy
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Feb 5, 2023, 8:12 PM IST

Updated : Feb 5, 2023, 8:42 PM IST

20:08 February 05

వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్​ఎస్​ చర్యలు

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై బీఆర్​ఎస్​ బహిష్కరణ వేటు వేసింది. కొన్ని నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి అతను బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ​ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై బీఆర్​ఎస్​ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది.

వైరా నియోజకవర్గంలో 20మంది నాయకులపై బీఆర్​ఎస్​ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్​ఫెడ్​ వైస్​ ఛైర్మన్​ బొర్రా రాజశేఖర్​ను బీఆర్​ఎస్​ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్​ జైపాల్​తో పాటు 18 మందిని సస్పెండ్​ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, బీఆర్​ఎస్​ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి.. పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్​ఎస్​ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 5, 2023, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.