ETV Bharat / state

కుంచపర్తిలో మెగా రక్త దాన శిబిరం - VEMSOORU MANDAL

ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలో మెగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు రక్తం అందిస్తున్న దాతలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర ప్రశంసించారు.

రక్త దాతల్ని అభినందించిన ఎమ్మెల్యే సండ్ర

author img

By

Published : Apr 26, 2020, 11:43 PM IST

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తిలో లయన్స్ క్లబ్, కుంచపర్తి యూత్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. తలసేమియా వ్యాధి గ్రస్తులు, గర్భిణీలు, ఇతర బాధితులకు అవసరమైన రక్త దానం చేస్తున్న యువత అభినందనీయులని కొనియాడారు. అనంతరం రక్త దాతలకు పండ్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ వసుమతి దేవి, డాక్టర్ కిరణ్ కుమార్, టీఎస్ యుటీఎఫ్ సభ్యులు రమేష్ , రాజేశ్వరరావు ,మురళీమోహన్, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ మహేష్, వేంసూరు ఎంపీపీ వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు సుమలత, జగన్మోహన్ రావు, ఎంపీటీసీ సభ్యుడు గొర్ల శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఇంకొంత కాలం లాక్​డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.