ETV Bharat / state

'సిరిపురం మేజర్ కాలువ చివరి భూములకు నీటిని విడుదల చేయాలి' - సిరిపురం మేజర్ కాలువపై భాజపా నాయకులు పాదయాత్ర

ఖమ్మం జిల్లా ఏన్కూరులో భాజపా నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. సిరిపురం మేజర్ కాలువ చివరి భూములకు నీళ్లు వచ్చేవిధంగా ఎన్ఎస్పీ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఏన్కూరు ప్రధాన కాలువ రెగ్యులేటర్ నుంచి తల్లాడ వరకు పాదయాత్ర చేశారు.

bjp latest protest in khammam enkoor, Siripuram Major canal news
ఖమ్మం జిల్లా ఏన్కూరులో భాజపా నాయకుల ధర్నా, సిరిపురం మేజర్ కాలువ
author img

By

Published : Mar 25, 2021, 4:51 PM IST

నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి సిరిపురం మేజర్ కాలువ చివరి భూములకు నీటిని విడుదల చేయాలని భాజపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ప్రధాన కాలువ రెగ్యులేటర్ వద్ద నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని రెగ్యులేటర్ నుంచి తల్లాడ వరకు సిరిపురం మేజర్ కాలువపై పాదయాత్ర చేశారు.

సిరిపురం మేజర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీళ్లు వచ్చే విధంగా ఎన్ఎస్పీ అధికారులు చర్యలు చేపట్టాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా నాయకులు కోరారు. కాలువ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. వారబందీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

ఇదీ చూడండి: ఒక వర్గానికే హామీలా? ఎమ్మెల్యే కంచర్ల సభ అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.