ETV Bharat / state

ఆ శాఖలో చర్చనీయాంశంగా బడా కాంట్రాక్టర్ల తీరు - విద్యుత్‌ శాఖలో గుత్తేదారుల గుత్తాధిపత్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖలో బడా కాంట్రాక్టర్ల ఇష్జారాజ్యం నడుస్తోంది. శాఖాపరంగా మంజూరైన పనుల కోసం సాగుతున్న ఓపెన్ టెండర్ల దాఖలులో పెద్ద గుత్తేదారులు చెప్పిందే వేదంగా సాగుతోంది. ఎంతటి అధికారులకైనా వారి మాటే శిలా శాసనమవుతోంది. కొత్త గుత్తేదారులు టెండర్ల దాఖలు చేయాలంటేనే హడలిపోతున్నారు. ఇద్దరో ముగ్గురో ధైర్యం చేసి ఓపెన్ టెండర్లు దాఖలు చేసేందుకు సిద్ధమైతే..వారికి బెదిరింపులు తప్పడం లేదు. గుత్తేదారుల తీరు విమర్శలకు తావిస్తుండగా అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

big contractors behavior is discussion in khammam electrical department
ఆ శాఖలో చర్చనీయాంశంగా బడా కాంట్రాక్టర్ల తీరు
author img

By

Published : Mar 26, 2021, 6:57 AM IST

ఆ శాఖలో చర్చనీయాంశంగా బడా కాంట్రాక్టర్ల తీరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యుత్‌ శాఖలో కొందరి గుత్తేదారులదే గుత్తాధిపత్యం కొనసాగుతోంది. అధికారుల ఎదుటే పలువురు గుత్తేదారులు బెదిరింపులకు దిగుతున్నారు. ఖమ్మం విద్యుత్ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఖమ్మం, ఖమ్మం గ్రామీణం, వైరా, సత్తుపల్లి డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్ల పరిధిలో ప్రస్తుతం శాఖా పరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గానూ ఓపెన్ టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్ లైన్లను ఆధునీకరించడం, కొత్త లైన్లు వేయడం, వేలాడే తీగలు, ఒరిగిపోయిన స్తంభాలు సరిచేయడం, నియంత్రికలకు పటిష్టమైన దిమ్మెల నిర్మాణం, 33/11 కేవీ విద్యుత్ లైన్లు తీయడానికి అధికారులు ఓపెన్ టెండర్లు ఆహ్వానించారు. ఆయా డివిజన్ల పరిధిలోని కార్యాలయాల్లో ఓపెన్ టెండర్లు దాఖలు చేస్తున్నారు.

కొత్త వ్యక్తి పాల్గొనవద్దు

ఖమ్మం సర్కిల్ పరిధిలో సాగుతున్న ఈ టెండర్ల వ్యవహారం కొందరు గుత్తేదారుల కనుసన్నల్లోనే సాగుతుందనేందుకు ఇటీవల ఖమ్మం, వైరా డివిజన్ కార్యాలయాల్లో సాగిన వ్యవహారమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. వైరా పరిధిలో ఓపెన్ టెండర్లలో పాల్గొనేందుకు కొంతకాలం క్రితమే అర్హత పొందిన గుత్తేదారు ఒకరు వెళ్లగా.. కొంతమంది బడా కాంట్రాక్టర్లు కొత్త వ్యక్తిని టెండర్‌లో పాల్గొనవద్దని అడ్డుకున్నారు. కార్యాలయం ఆవరణలో సాక్షాత్తూ అధికారుల ముందే కొత్త కాంట్రాక్టర్ దగ్గరి నుంచి టెండర్ కాపీ తీసుకున్నారు. ఈ నెల 23న ఖానాపురం హవేలీలోని అసిస్టెంట్ డివిజన్ కార్యాలయం పరిధిలోనూ ఓపెన్ టెండర్ వేసేందుకు వెళ్లిన కొంతమంది గుత్తేదారులను బెదిరింపులు తప్పలేదు.

సెక్షన్లు పంచుకున్నారు

దాదాపు ఏడాది కాలంగా విద్యుత్ శాఖలో మంజూరైన అభివృద్ధి పనుల్లో కొంతమంది గుత్తేదారులు చెప్పిందే వేదంగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. పలు సెక్షన్లలలో కొందరు బడా గుత్తేదారులు రెండు, మూడు సెక్షన్లు పంచుకున్నారు. ఆయా సెక్షన్లలో ఇతరులెవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారు. హడలిపోయిన కొంతమంది కొత్త గుత్తేదారులు లైసెన్సు పొంది ఏడాది గడిచినా ఇప్పటి వరకూ ఒక్క టెండర్‌లోనూ పాల్గొనలేదు.

యంత్రాంగం అండదండలు!

ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్ శాఖలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు గుత్తేదారులు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో విద్యుత్‌ యంత్రాంగం అండదండలు కొంతమంది బడా గుత్తేదారులకు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం అంతా పారదర్శకంగానే సాగుతోందంటూ సమాధానమిస్తున్నారు.

ఇదీ చూడండి : నేటితో ముగియనున్న బడ్జెట్​ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.