ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని జిల్లా వామపక్ష, కాంగ్రెస్ నేతలు కోరారు. రహదారులపైకి వచ్చిన వాహనదారులను తిరిగి పంపిస్తూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం నగరంలో దుకాణాలన్నీ మూసివేయడం వల్ల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వామపక్ష, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
- ఇదీ చూడండి : రాజధానికి అన్నివైపులా ఐటీ పరిశ్రమల విస్తరణ