ఖమ్మం జిల్లా వైరా పోలింగ్ కేంద్రంలో తెరాస, ప్రత్యర్థి పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటేసేందుకు ఎమ్మెల్యే రాములునాయక్ రాగా.. ఆయనతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు వచ్చారు. ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. వారి మధ్య వాదనలు పెరగడం వల్ల ఏసీపీ సత్యనారాయణ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'