ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరిచారు' - khammam latest news

వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని.. అఖిలపక్ష నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

strike at khammam
'వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరిచారు'
author img

By

Published : Nov 26, 2020, 8:58 AM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె ఖమ్మంలో జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అఖిల పక్ష నేతలు అడ్డుకున్నారు. అనంతరం అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేశారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచారని విమర్శించారు. వెంటనే ఆయా చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.