ఖమ్మం మెప్మాలో లంచగొండి తిమింగలాన్ని అవినీతి నిరోధక అధికారులు వల పన్ని పట్టుకున్నారు. జిల్లా మిషన్ సమన్వయ కర్త కమలశ్రీ ఒక రిసోర్స్ పర్సన్ వద్ద నుంచి 40వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెప్మాలోని రిసోర్స్ పర్సన్‌ల ఉద్యోగ నియామకాల్లో వచ్చిన నిబంధన ప్రకారం పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. గొల్లగూడెం రిసోర్స్ పర్సన్ పదో తరగతి అర్హత లేదు. కానీ వారికి డీఎంసీ సంతకంతో కొంత గడువు ఇవ్వొచ్చు. అందుకోసం కమలశ్రీ సదరు ఆర్పీని 50 వేలు లంచం అడిగింది. దీంతో బాధితురాలు అనిశా అధికారులను సంప్రదించారు. కమలశ్రీకి 40వేలు లంచం ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం నగరానికి చెందిన ఆర్పీలు భారీ సంఖ్యలో మెప్మా కార్యాలయానికి చేరుకున్నారు. కమలశ్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బుల కోసం తమను తీవ్రంగా వేధించిందని వారు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రేపే రెండో విడత స్థానిక సమరం