ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమకు చెందిన ఓ మహిళకు పురిటినోప్పులు రాగా.. కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆమెను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమయ్యాయి.
108 సిబ్బంది రామారావు, నాగేశ్వరరావు ఆమెకు చికిత్స అందించారు. అంబులెన్స్‌లోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి: పాల ప్యాకెట్ల చోరీలు... సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు