ఖమ్మంలో అవినీతికి పాల్పడుతూ ఓ ఉద్యోగి అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ధ్వంసలాపురం విద్యుత్ ఉప కేంద్రంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సిజాఉద్దీన్ ఓ అపార్ట్ మెంట్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అమర్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని అపార్ట్మెంట్ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన అధికారులు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు పథకం పన్నారు. యజమాని 20 వేలు ఇస్తానని చెప్పి ఒప్పుకొని డబ్బు ఇస్తుండగా... అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఎసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి