ETV Bharat / state

ఖమ్మంలో 440 కిలోల గంజాయి స్వాధీనం - ganjai caught by police

ఖమ్మంలో పెద్ద ఎత్తున గంజాయిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్​ కాలనీలో ఓ ట్రాక్టర్​లో తరలింపునకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ.44 లక్షల విలువైన 440 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

440 kilograms of ganjai caught by khammam task force poice

author img

By

Published : Jul 3, 2020, 4:01 PM IST

ఖమ్మంలో తరలింపునకు సిద్ధంగా ఉంచిన గంజాయిని టాస్క్‌ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని శ్రీనగర్‌ కాలనీ 9వ వీధిలోని ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పెద్దఎత్తున గంజాయిని దాచి ఉంచారు. అందుకోసం ట్రాక్టర్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా లోపల సుమారు 440 కిలోల గంజాయిని దాచి ఉంచారు.

టాస్క్‌ఫోర్సు పోలీసులు ట్రాక్టర్‌ను సోదా చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయి ట్రాక్టర్‌కు కాపలాగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహబుబాబాద్​కు చెందిన కొందరు వ్యక్తులు ఒడిశా నుంచి గంజాయిను ఆక్రమంగా తీసుకువచ్చి మహారాష్ట్రకు తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.44 లక్షలు ఉంటుందని టాస్క్​ఫోర్స్​ ఏసీపీ వెంకట్రావ్‌ చెప్పారు.

ఇవీ చూడండి: రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.