బిస్కెట్లు, చాక్లెట్ ప్యాకెట్ల డబ్బాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఖమ్మం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం పోలీస్స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కంటైనర్ను ఆపే ప్రయత్నం చేయగా... పోలీసులను చూసి డ్రైవర్ పారిపోయాడు. కంటైనర్ను తెరిచి చూడగా... భారీగా గంజాయి కట్టలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది బ్యాంకుల సెలవులు ఇవే!