సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలు భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైనవని జమాతే ఇస్లామీ హింద్ జేఏసీ తెలంగాణ కన్వీనర్ ముస్తాక్ మాలిక్ డిమాండ్ చేశారు. దేశంలో హిందువులకు, ముస్లింలకు గొడవలు లేవని... కేంద్ర ప్రభుత్వంతోనే విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్పీఆర్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సర్వే నిర్వహించాలని... దానికి తాము పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి