సాధారణంగా సెలవులు దొరికితే చాలు.. విహారయాత్రలకు వెళ్లడం... సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేయడం యువతకు పరిపాటిగా మారింది. అయితే కరీంనగర్‌కు చెందిన కొంతమంది మిత్రులు మాత్రం పూర్తిగా భిన్నంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. దిగువమానేరు జలాశయం ముళ్లచెట్లు, ప్లాస్టిక్ వస్తువులతో మురికిగా మారడాన్ని గమనించిన కరీంనగర్‌కు చెందిన వ్యాపారి భవిన్‌పటేల్... చెత్తను తొలగిస్తూ సామాజిక బాధ్యతగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఇక్కడి యువత స్వచ్ఛతా కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. సెలవు వచ్చిదంటే చాలూ కలిసికట్టుగా మిడ్‌మానేరు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
సర్కారీ బడులకు రంగులు
ఇదే సమయంలో రంగులు లేక కళాహీనంగా మారిన ప్రభుత్వ పాఠశాలకు కొత్తకాంతులు అద్దే కార్యాన్ని భూజానికెత్తుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేస్తూ సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. సెలవు రోజుల్లో ఆయా పాఠశాలలకు రంగులు వేస్తూ స్ఫూర్తిని నింపుతున్నారు.
విద్యార్థుల హర్షం
పర్యాటక ప్రాంతంగా ఉన్న దిగువమానేరు జలాశయంలో మొలిచిన ముళ్ల చెట్లను తొలగించడమే కాకుండా... పాఠశాలకు రంగులు వేయడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ..మిగతా వారిలో చైతన్యం నింపుతున్న ఇక్కడి యువత అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి: సంకల్ప బలం ముందు ఓడిన క్యాన్సర్