world record with national anthem: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కరీంనగర్ పట్టణానికి చెందిన అర్చన అనే ఓ యువతి వరల్డ్ రికార్డు సాధించింది. జాతీయ గీతం 'జనగణమన'ను సంపూర్ణంగా 75సార్లు ఆలపించి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టింది. ఈ కార్యక్రమాన్ని నగర మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంపూర్ణ జాతీయ గీతం 5 చరణాలు ఉంటుందని.. ఒక్కో చరణానికి 52 సెకన్ల చొప్పున 5 చరణాలు ఆలపించేందుకు దాదాపు 6 నిమిషాల సమయం పడుతుందని అర్చన పేర్కొన్నారు. ఏకధాటిగా 75 సార్లు సంపూర్ణ జాతీయ గీతాన్ని పాడేందుకు సుమారు 7 గంటల సమయం పట్టిందని తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అనుమతితో మధ్యలో 20 నిమిషాలు బ్రేక్ తీసుకున్నట్లు ఆమె వివరించారు.
50 పర్యాయాలు పరిశీలించిన తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు తనకు అనుమతించినట్లు అర్చన చెప్పారు. చిన్ననాటి నుంచి తనకు జాతీయ గీతం ఆలపించాలన్న ఆసక్తి ఉండేదని.. అందులో భాగంగానే ఐదు చరణాలను నేర్చుకున్నానని ఆమె వివరించారు.
నేను సంపూర్ణ జనగణమన గీతాన్ని ఏకధాటిగా 75సార్లు ఆలపించి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాను. మన జాతీయ గీతం పూర్తిగా 5 చరణాలు ఉంటుంది. దీనిని పాడేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కో చరణాన్ని 52 సెకన్లలో పాడాలి. అలా 5 చరణాలను 75 సార్లు పాడటానికి నాకు 7 గంటల సమయం పట్టింది. డబ్ల్యూబీఆర్ వారి అనుమతితో నాకు మధ్యలో 20 నిమిషాల విరామం లభించింది.-అర్చన
ఇవీ చూడండి..
మద్యం మత్తులో దివ్యాంగుడు హల్చల్.. పోలీసులకు ధమ్కీ ఇస్తూ నానా రచ్చ..
యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్ శర్మ వీడియో చూడడమే కారణం'!