ETV Bharat / state

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు - ELLAMPALLI

కాళేశ్వరం జలాలకు తోడు కడెం నుంచి వస్తున్న నీటిప్రవాహంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జలకళ ఉట్టి పడుతోంది. కాళేశ్వరం మొదటి లింక్ ద్వారా వచ్చి చేరే నీటిని మధ్య మానేరుకు తరలించడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకంగా మారింది.

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
author img

By

Published : Aug 7, 2019, 5:07 AM IST

Updated : Aug 7, 2019, 9:04 AM IST

మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం జళకలతో ఉట్టిపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా మారిన ఈ ప్రాజెక్టుకు అటు మేడిగడ్డ నుంచి, ఇటు కడెం జలాశయం నుంచి నీటి ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ... ప్రస్తుతం మధ్య మానేరుకు నీరు అందించే కార్యక్రమం కాస్త నెమ్మదిగా సాగుతోంది. జలాశయంలోని నీటి తరలింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండగా... ఇన్‌ఫ్లో మాత్రం గంటగంటకు పెరుగుతూ నీటిని నిలుపుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయికి చేరింది. కడెం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకొని 5 నుంచి 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. గేట్లు ఎత్తడం వల్ల ఇక్కడికి సందర్శకుల తాకిడి పెరిగింది.

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు

ఇవీ చూడండి: 'సుష్మా' భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

ఫైల్ నేమ్ : TG_ADB_11_05_YELLAMPALLI GATE OPEN_AV_TS10032 రిపోర్టర్ : సంతోష్ మైదం, మంచిర్యాల.. యాంకర్ విజువల్ బైట్ : మంచిర్యాల జిల్లా లో గత నాలుగు రోజుల నుండి విస్తరంగా వర్షం కురవడం తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండముతో ఎల్లంపల్లి జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ ఎత్తు నీటి మట్టం 148.00 మీటర్లు ఉండగా గా 147.81 మీటర్ల కు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20టి‌ఎం‌సి లకు గాను ప్రస్తుతం 19.64 టి‌ఎం‌సి లకు చేరుకోవడంతో 10 గెట్లను 0.5 మీటర్ల ఎత్తి 27,910 క్యూసెక్ ల వరద నీటిని జలాశయం అధికారులు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ,లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమతంగా ఉండాలని నది లోకి ఎవరు వెల్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Last Updated : Aug 7, 2019, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.