ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 15వ రోజుకు చేరుకుంది. తెలంగాణ బంద్ సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు, తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ ఒకటి, రెండవ డిపో నుంచి ఉదయం ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు నడవకపోవడం వల్ల రోడ్లన్నీ బోసిపోయాయి.
ఇదీ చూడండి : నేడు రాష్ట్రవ్యాప్త బంద్