ETV Bharat / state

cable bridge: రెండు నగరాల మధ్య అద్భుత తీగల వంతెన - bridge constructed

కరీంనగర్‌ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి వనరుని సద్వినియోగం చేసుకొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్‌-వరంగల్ రహదారిలో ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా... అల్గునూరు బ్రిడ్జిపై ఒత్తిడిని తగ్గించేందుకు తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటంతోపాటు పర్యాటకంగాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగినా... ప్రస్తుతం ఊపందుకున్నాయి.

cable bridge karimnagar, cable bridge news today
cable bridge: రెండు నగరాల మధ్య అద్భుత తీగల వంతెన
author img

By

Published : Jun 28, 2021, 10:30 AM IST

cable bridge: రెండు నగరాల మధ్య అద్భుత తీగల వంతెన

కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నగరానికే సరికొత్త శోభను తీసుకువచ్చింది. మూడేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా... పనులు వేగంగా జరుగుతున్నాయి. పూర్తిగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా వంతెనను తీర్చిదిద్దుతున్నారు. ఈ వంతెన కరీంనగర్‌- వరంగల్‌ మధ్య ట్రాఫిక్‌ రద్ది తగ్గించటంతోపాటు పర్యాటకులకు ఆహ్లాదం కలిగించనుంది.

మానేరు నదిలో పడవ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో... రెండు వైపులా 220 మీటర్ల ఎత్తులో పైలాన్లు నిర్మిస్తున్నారు. పైలాన్లను 136 సెగ్మెంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తికాగా... మరో రెండు నెలల పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వంతెనను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ఈ ఏడాది చివరికల్లా తీగల వంతెన నిర్మాణం పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 2020 నాటికే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... కరోనా, వర్షాల కారణంగా ఆలస్యమైంది. తొలుత 143 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించినా.... మార్పులు చేర్పులతో వ్యయం 183 కోట్లకు చేరింది. ప్రధానంగా కరీంనగర్‌ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లే వాహనాలు... కేవలం అల్గునూరు బ్రిడ్జిపై నుంచి వెళుతున్నాయి. అందువల్ల ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న తీగల వంతెన కరీంనగర్‌ నగరానికే తలమానికంగా నిలుస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్‌ పనులు చకచక చేస్తూనే... తీగల వంతెనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ వంతెనతో పోలిస్తే... కేబుల్‌ బ్రిడ్జికి 150 శాతం నిధులు ఎక్కువగా వెచ్చించి... ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణంలో టర్కీ, మలేషియా, స్విట్జర్లాండ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. తీగల వంతెనకు తోడు మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం జరిగితే భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తీగల వంతెన నిర్మాణం పూర్తైతే... పెద్దపల్లి,చొప్పదండి వైపు నుంచి ట్రాఫిక్‌ నగరంలోకి ప్రవేశించకుండానే వరంగల్‌కు వెళ్లే ఆస్కారం కలుగుతుందని... రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: భయం గుప్పిట్లో ముంపు బాధితులు.. పునరావాసం కోసం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.