కరీంనగర్‌లో తాగునీరు కాస్తా మురుగునీరుగా మారిపోయిందని... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. సమయపాలన లేకుండా నల్లా నీళ్లు వదులుతున్నారని, అవి కూడా మురుగు నీరేనని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ