ETV Bharat / state

భర్త పట్టించుకోవడం లేదంటూ ట్యాంక్ ఎక్కి నిరసన - భర్త పట్టించుకోవడం లేదని నిరసన

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్​లో భర్త పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ వాటర్​ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని వాపోయింది.

chinna mulkanoor karimnagar
భర్త పట్టించుకోవడం లేదంటూ ట్యాంక్ ఎక్కి నిరసన
author img

By

Published : May 29, 2021, 3:55 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్​లో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మహిళకు చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన పెసరి నాగరాజుతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉండగా… ఆరు నెలలుగా తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆమె మానకొండూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరగా… ఆ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేదేమి లేక చిన్న ముల్కనూరులోని అత్తగారి ఇంటికి చేరుకుని నీళ్ల ట్యాంకు ఎక్కి తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకుని ఘటనా స్థాలానికి చేరుకున్న ఎస్సై మధుకర్ ఆమెతో ఫోన్​లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆమె కిందకి దిగింది.

ఇదీ చూడండి: Arrest: చిత్తూరు జిల్లా పరువు హత్య కేసు: నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.