ETV Bharat / state

Nandi Medaram: నంది మేడారం నుంచి జలాల ఎత్తిపోత - Nandi Medaram news

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో నీటిపారుదలశాఖ అధికారులు నంది మేడారం(Nandi Medaram)లోని ఆరో ప్యాకేజీ పంపుహౌస్‌లో రెండు మోటార్లతో ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇవాళ మరో మోటార్‌ ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టారు.

Nandi Medaram
నంది మేడారం
author img

By

Published : Jun 18, 2021, 8:08 PM IST

జలాల ఎత్తిపోత

కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నీరు అడుగంటడంతో కాళేశ్వరం (Kaleshwaram) జలాలను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. కాళేశ్వరం (Kaleshwaram) ఎత్తిపోతల పథకం కింద ఎగువకు గోదావరి జలాల ఎత్తిపోసే ప్రక్రియ రెండు రోజుల కిందట ప్రారంభం కాగా మరింత ఉద్ధృతమైంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో నీటిపారుదలశాఖ అధికారులు నంది మేడారం(Nandi Medaram)లోని ఆరో ప్యాకేజీ పంపుహౌస్‌లో రెండు మోటార్లతో ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇవాళ మరో మోటార్‌ ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 9,450 క్యూసెక్కుల గోదావరి జలాలు నందిమేడారం రిజర్వాయర్​లోకి చేరుతున్నాయి.

ఈ జలాశయంలో 228.8 మీటర్ల నీటిమట్టం స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్​ పైనున్న రెగ్యులేటర్ల నుంచి ఇంతే ప్రవాహాన్ని ఏడో ప్యాకేజీలోని సొరంగాల ద్వారా ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతున్నారు. గాయత్రి పంపుహౌస్‌ లోనూ రెండు మోటార్లను నడిపిస్తూ వరదకాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.

మధ్య మానేరు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువమానేరు జలాశయానికి నీటిని 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం దిగువన మానేరు వాగులోని బావులు, బోర్ల వద్ద ఉన్న వ్యవసాయ మోటార్లను తొలగించుకోవాలని రైతులకు ఇప్పటికే సూచించారు.

ఇదీ చదవండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్​డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.