కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తొలిసారిగా వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్న క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాజీ కుదుర్చుకునే వీలున్న కేసులన్నింటిని ఇక్కడ పరిష్కరిస్తామన్నారు.
కక్షిదారులు తమతమ న్యాయవాదులను సంప్రదిస్తే తదుపరి ప్రక్రియ వారు చేపడతారని న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాలో 1100 కేసులు ఉన్నట్లు గుర్తించామని దీనికి సంబంధించి కక్షిదారులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గం. మధ్యలో కేసుకు సంబంధించిన ఇరు వర్గాలు మొబైల్‌వ్యాన్ వద్ద హాజరుకావాల్సి ఉంటుందని న్యాయమూర్తి వివరించారు.
ఇదీ చదవండి: ఆర్సీబీxసన్రైజర్స్ : గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికే