కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయటం లేదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముందు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
పరిస్థితి మారలే..
ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ పథకం పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. నీరు సరఫరా చేయటం లేదని ప్రజలందరూ ఆయన ముందే ముక్తకంఠంతో తెలిపారు.
పరిస్థితిపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. తాను రెండేళ్లుగా ఇరవై సార్లు సమీక్ష నిర్వహించినా పరిస్థితి మారటం లేదని ఆగ్రహం వ్యక్తం చెశారు.
ఇదీ చూడండి: 'కుటుంబపాలన లేని వ్యవస్థతోనే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు'