ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో చిన్నపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావట్లేదు. సకాలంలో వర్షాలు పడలేదని బాధపడ్డ కర్షకులకు ఈ వర్షాలు కొద్దిగా ఊరటనిచ్చాయి. పత్తి ఎండిపోయే దశలో చిన్నపాటి వానలు రక్షించాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇక అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ..!