ETV Bharat / state

విషాదం మిగిల్చిన ఈత సరదా - Two young men drowned when they went for a swim in Karimnagar district

కరీంనగర్​ జిల్లా జంగపల్లిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు చనిపోవటం వల్ల తల్లదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఇది చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Two young men drowned when they went for a swim in Karimnagar district
విషాదం మిగిల్చిన ఈత సరదా
author img

By

Published : May 14, 2020, 4:32 PM IST

కరీంనగర్ జిల్లా జంగపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ఏనుగుల అనిల్, ముత్త ఓదేలు చెరువులో గల్లంతయ్యారు. హుటాహుటిన వెళ్లిన తల్లిదండ్రులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారులు చనిపోవటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.