ఠాణాలో భద్రపరిచిన మద్యం సీసాలను సీఐ గన్‌మెన్, డ్రైవర్ అపహరించారు. విషయం పోలీసు అధికారులకు తెలియడంతో విచారణ చేపట్టి బుధవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ రెండో ఠాణా సీఐ దేవారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 9న విద్యానగర్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తుండగా 92 సీసాలను పట్టుకుని ఠాణాలోని ఓ గదిలో భద్రపరిచారు. సీఐ గన్‌మెన్‌గా పని చేస్తున్న సాయిని అరుణ్, వాహన డ్రైవర్ రాణాప్రతాప్ అర్ధరాత్రి ఠాణాకు వచ్చి ఒక్కో సీసాను ఎత్తుకెళ్లారు.
ఇలా మొత్తం 69 సీసాలను అపహరించారు. వీరిపై అనుమానం రాగా సీసీ ఫుటేజీ పరిశీలించగా విషయం బయటపడింది. విచారించగా తప్పును ఒప్పుకోవటం వల్ల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.