కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి సహకార సంఘం ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఛైర్మన్ పదవి కోసం తెరాసపార్టీలోని ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మెట్‌పల్లిలో మొత్తం 13 వార్డులుండగా... ఇద్దరు తెరాస మద్దతుదారులు డైరెక్టర్లుగా గెలిచారు. ఇద్దరు అభ్యర్థులు ఛైర్మన్ పదవులను ఆశిస్తుండటం వల్ల 4వ వార్డులో గెలిచిన అభ్యర్థిని శిబిరానికి తరలించే క్రమంలో గొడవ చెలరేగింది.
ఇద్దరు అభ్యర్థులకు చెందిన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. కాసేపు శ్రమించి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇవీ చూడండి:శంషాబాద్‌లో 1100 గ్రాముల బంగారం పట్టివేత