కరీంనగర్ జిల్లా ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో డిపో వద్దకు చేరుకున్నారు. బస్సులను నడిపేందుకు డిపో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్దకు చేరుకున్నారు. హుజూరాబాద్ డిపో పరిధిలో 74 బస్సులు ఉన్నాయి. అధికారులు బస్సులను నడిపించేందుకు ప్రయివేటు డ్రైవర్లను రంగంలోకి దింపారు. పోలీసుల పహారా మధ్య బస్సులను డిపో నుంచి బయటకు తీశారు. వాటిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. పోలీసుల పహార మధ్య బస్సులు అరకొరగా నడుస్తున్నాయి.
ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సుల్లోనూ రెట్టింపు ఛార్జీలు...