రాష్ట్ర ప్రభుత్వ సహకారంపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో జరిగిన ఆర్టీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్‌తో చర్చించి కార్మికులకు రావలసిన బకాయిలు ఇప్పించాలని కోరారు.
యూనియన్ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి చర్యలతో ఆర్టీసీ అథోగతిపాలైందని థామస్‌రెడ్డి అన్నారు. కార్మికుల ఒత్తిడితోనే ఆయన యూనియన్‌కు రాజీనామా చేయాల్సివచ్చిందని పేర్కొన్నారు. తమ సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవితను నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి తాము సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతు ఉండాలనే లక్ష్యంతో తిరిగి యూనియన్ను తెరపైకి తెస్తున్నామని థామస్‌రెడ్డి అన్నారు. కొందరు కమిటీల పేరుతో భాజపాకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్