ETV Bharat / state

Telangana MLC elections Results 2021 : కరీంనగర్​లో తెరాస సునాయాస విజయం.. కారణాలు ఇవేనా? - Former Mayor sardar ravinder singh

Telangana MLC elections Results 2021, mlc election results 2021
కరీంనగర్​లో తెరాస విజయం, ఆదిలాబాద్​లో తెరాస విజయం
author img

By

Published : Dec 14, 2021, 9:59 AM IST

Updated : Dec 14, 2021, 2:38 PM IST

09:54 December 14

కరీంనగర్​ ఉత్కంఠకు తెర.. తెరాస సునాయాస విజయం

తెరాస సునాయాస విజయం

Telangana MLC elections Results 2021 : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయఢంకా మోగించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో... ఆ జిల్లాలోని రెండు స్థానాల్లో అధికార పార్టీ సునాయాసంగా గెలుపొందింది. తెరాస అభ్యర్థులు భానుప్రసాద్ 584 ఓట్లు, ఎల్.రమణ 479 ఓట్లతో విజయం సాధించారు. కాగా స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు పోల్ అయ్యాయి.

కరీంనగర్​ ఉత్కంఠ ఎందుకు?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండు స్థానాల్లో తెరాస తరఫున ఎల్​. రమణ, భానుప్రసాద్​రావును అధిష్ఠానం బరిలో నిలిపింది. మొత్తంగా 24 మంది నామినేషన్లు వేయగా.. పార్టీ నేతలు అతికష్టం మీద 14 మందిని ఉపసంహరింపజేయగా.. బరిలో 10 మంది నిలిచారు. ఇందులో కరీంనగర్​ మాజీ మేయర్​ సర్దార్​ రవీందర్​ సింగ్​ కూడా ఉన్నారు. తెరాసకు మెజార్టీ ఉన్నా.. సర్దార్​ రవీందర్​ సింగ్ బరిలో నిలవటం​.. మరోవైపు నిఘావర్గాలు హెచ్చరికలతో.. అధిష్ఠానం ముందు నుంచే జాగ్రత్త పడడం మరింత ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి బరిలో నిలిచిన సర్దార్ రవీందర్​సింగ్​ కారణంగానే గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఈ ఆసక్తికర పరిణామాల మధ్య పోలింగ్​ జరిగింది. పోలింగ్ ప్రక్రియ​ ముగియగానే.. రవీందర్ సింగ్ సహా అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకోవటం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ రెండు స్థానాల్లో ఫలితాలు ఉత్కంఠగా మారాయి.

స్వయంగా మంత్రుల మానిటరింగ్..

Ministers monitoring in karimnagar mlc elections: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్​, మేయర్​ సునీల్‌రావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలే స్వయంగా వెళ్లి.. ప్రజాప్రతినిధులను మానిటరింగ్ చేశారు. రోజూ సమావేశమవుతూ.. ప్రత్యర్థుల ప్రభావం లేకుండా జాగ్రత్తపడ్డారు. క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వారిగా లెక్కలు తీసి.. ప్రత్యర్థి వైపు మొగ్గుచూపుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వారి ఓట్లు డైవర్ట్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్​ వరకూ క్యాంపుల్లోనే ఉండి.. నేరుగా కేంద్రాలకు వచ్చి నేతలు ఓట్లేశారంటే.. తెరాస అధిష్ఠానం చాలా ఎంత అప్రమత్తంగా వ్యవహరించిందో అర్థమవుతోంది.

తెరాస స్పెషల్ ఫోకస్

Training on MLC Voting: ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస అభ్యర్థులిద్దరూ గెలవాలని.. క్రాస్​ ఓటింగ్​ జరగకూడదనే గట్టి పట్టుదలతో తెరాస ప్రణాళికలు అమలుచేసింది. సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును రమణకు, రెండో ప్రాధాన్య ఓటును భానుప్రసాదరావు వేయాలని.. మిగిలిన సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును భానుప్రసాదరావుకు, రెండో ప్రాధాన్యత ఓటును ఎల్​.రమణకు వేయాలన్న అంశంపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు.

సర్దార్​ బలం ఏంటి?

Former Mayor sardar ravinder singh : మేయర్​గా​ చేసిన అనుభవంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న నేతలతో సర్దార్​కు వ్యక్తిగత పరిచయాలున్నాయి. అదీ కాక.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. తెరాస రెబల్​గా బరిలో నిలవడంతో సర్దార్​కు ప్రత్యర్థి పార్టీల మద్దతు కూడా లభించింది. హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సైతం.. రవీందర్​ సింగ్​కు మద్దతిచ్చారు. ఇన్ని పరిణామాల మధ్య.. తెరాస నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కచ్చితంగా క్రాస్ ఓటింగ్ చేశారని సర్దార్ రవీందర్ సింగ్ అనుచరులు ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. అధికార తెరాస క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తన విక్టరీకి తగ్గట్టుగా ఓట్లు పడితీరాయని సర్దార్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

తెరాస విజయకేతనం

TRS Wins in Karimnagar two seats: మొత్తానికి మంగళవారం వెలువడిన ఫలితాల్లో కరీంనగర్ ఉత్కంఠకు తెర పడింది. రెండు స్థానాల్లోనూ తెరాస సునాయాసంగా విజయకేతనం ఎగురవేసింది. మొదటి నుంచి అధికార పార్టీ తీసుకున్న జాగ్రత్తలు అనుకూల ఫలితాలు ఇచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం

Last Updated : Dec 14, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.